కలెక్టరేట్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Apr 7 2026 7:37 AM | Updated on Apr 7 2026 7:37 AM

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌ వెలుపల ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కలెక్టరేట్‌ ప్రహరీకి ఆనుకుని ఉన్న విద్యుత్‌ టవర్‌కు తన అడ్డపంచతో ఉరి వేసుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన కలెక్టరేట్‌ సెక్యూరిటీ గార్డ్‌ రాఘవేంద్ర వెంటనే అతని చర్యలను అడ్డుకున్నాడు. సమాచారం ఇవ్వడంతో ఒకటో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని ఆరా తీశారు. తన స్వగ్రామం రాయదుర్గం నియోజకవర్గం రాతిబాయివంక అని, పేరు రాముడు నాయక్‌ అని సదరు వ్యక్తి వెల్లడించాడు. అనంతపురంలోని వేణుగోపాల్‌ నగర్‌ ఆటో స్టాండ్‌ సమీపంలో నివాసముంటున్నట్లు తెలిపాడు. భార్య పేరు సరోజబాయి, కుమారులు మోహన్‌, కుమార్‌, కోడలు జానకీబాయి ఉన్నారని పేర్కొన్నాడు. అయితే తనకు గాలిసోకిందని, ఐదారుగురు ఆడవాళ్లు పై నుంచి వచ్చి తనను చంపాలని ప్రయత్నం చేస్తున్నారని వాపోయాడు. తాను ఎక్కడికి వెళ్లినా వెనకే ఉంటారని, ఇప్పుడు కూడా గడియారం స్తంభం నుంచి వస్తుంటే వాళ్లు కూడా తనతో పాటే వచ్చాని, ఎప్పటికై నా వాళ్లు చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. బళ్లారికి తీసుకెళ్లి మంచి అంత్రం వేయించి కాపాడాలని వేడుకున్నాడు. పూర్తిగా విన్న పోలీసులు అతని మానసిక స్థితి సరిగా లేదని నిర్ధారించారు. మంచి అంత్రం వేపిస్తామంటూ పోలీసు స్టేషన్‌కు పిలుచుకెళ్లారు.

అడ్డుకున్న కలెక్టరేట్‌ సెక్యూరిటీ గార్డ్‌

Advertisement
 
Advertisement
Advertisement