● భగళాముఖిదేవీ నమోస్తుతే.. | - | Sakshi
Sakshi News home page

● భగళాముఖిదేవీ నమోస్తుతే..

Feb 23 2026 7:08 AM | Updated on Feb 23 2026 7:08 AM

● భగళాముఖిదేవీ నమోస్తుతే..

● భగళాముఖిదేవీ నమోస్తుతే..

ఉరవకొండ రూరల్‌: మండలం పరిధిలోని నింబగల్లులో ఆదివారం భగళాముఖిదేవి రథోత్సవం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున గురు సిద్ధావదూత ఉత్సవం తర్వాత మఠాధిపతి సిద్ధప్పస్వామి భవిష్యవాణిభక్తులకు వినిపించారు. ఇదిలా ఉండగా.. ఉదయం నుంచే భగళాముఖిదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. సాయంత్రం ప్రత్యేక అలంకరణ తర్వాత రథంపై భగళాముఖిదేవిని కొలువుదీర్చారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు నడుమ గ్రామ ప్రధాన వీధుల్లో భక్తజన సందోహం నడుమ రథాన్ని లాగారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement