జగన్‌ను చూస్తే బాబు–పవన్‌కు భయం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ను చూస్తే బాబు–పవన్‌కు భయం

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

జగన్‌

జగన్‌ను చూస్తే బాబు–పవన్‌కు భయం

గుంతకల్లుటౌన్‌: ‘చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల గుండెల్లో భయాన్ని పుట్టించిన మొనగాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్‌సీపీకి 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారని వారు ఎగతాళి చేస్తున్నారు. మరి ఆ 11 మందిని చూస్తే వారికి వెన్నులో వణుకు పుడుతోంది’ అని వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం గుంతకల్లులోని బీరప్పగుడి ఫంక్షన్‌ హాలులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ స్థాయి గ్రామ, వార్డు కమిటీల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథి రాచమల్లుతో పాటు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ పరిశీలకుడు నరేష్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్‌, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ పరిశీలకుడు బోయ తిప్పేస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు కుట్రలు, కుతంత్రాలు, ఈవీఎం మోసాలతో గెలిచారన్నారు. అయినా క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ ప్రజాదరణ ఏమాత్రమూ తగ్గలేదన్నారు. వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం హింసాత్మక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. భయపెట్టినా, అక్రమ కేసులు బనాయించినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మాత్రం ధైర్యంగా నిలుస్తున్నారన్నారు. ఇదే పోరాట స్ఫూర్తితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జింకల రామాంజినేయులు, జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాది లింగేశ్వరబాబు, గుంతకల్లు, గుత్తి మున్సిపల్‌ చైర్‌పర్సన్లు భవాని, వన్నూర్‌బీ, వైస్‌చైర్‌పర్సన్‌ వరలక్ష్మి, ఎంపీపీ విశాలాక్షి, చెన్నకేశవరెడ్డి, దిలీప్‌రెడ్డి, మూడు మండలాల పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఎం.డి.ఖలీల్‌, పి.రాము, మధుసూదన్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, రామకృష్ణనాయక్‌, సి.వి.రంగారెడ్డి, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ అనుబంధ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో హింస రాజ్యమేలుతోంది

అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తాం

పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుడు రామచల్లు పిలుపు

జగన్‌ను చూస్తే బాబు–పవన్‌కు భయం 1
1/1

జగన్‌ను చూస్తే బాబు–పవన్‌కు భయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement