నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

నేడు

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదిక వేదిక నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ సి.విష్ణు చరణ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. పరిష్కార వేదికలోనే రెవెన్యూ క్లినిక్‌ ఉంటుందని, భూ సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేయవచ్చని తెలిపారు.

21, 22 తేదీల్లో

‘పిల్లల పండుగ’

అనంతపురం సెంట్రల్‌: అనంత బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ డిగ్రీ కళాశాలలో ‘పిల్లల పండుగ–6’ నిర్వహించనున్నట్లు బాలోత్సవం కార్యదర్శి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి సావిత్రి తెలిపారు. కార్యక్రమ బ్రోచర్‌ను ఆదివారం ఎస్పీ జగదీష్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. పిల్లలు, తల్లిదంద్రుడులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సురేష్‌, తిరుపాల్‌, గీత, శైలజ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులపై కుక్కల దాడి

కణేకల్లు: వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మాల్యం గ్రామంలో ఆదివారం నాలుగేళ్ల బాలుడు అలీబాషా ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి. ముఖంపై కరిచి గాయపరిచాయి. ఇక కణేకల్లులోని రామనగర్‌ భువనేశ్వర్‌ అనే నాలుగేళ్ల బాలుడు తన ఇంటి ముందు నిల్చుని ఉండగా కుక్కలు దాడిచేయడంతో గాయపడ్డాడు. వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రాణాలు పోతే తప్ప చలనం రాదా అని ప్రశ్నిస్తున్నారు.

కొలగానహళ్లిలో

వ్యక్తి దారుణ హత్య

మృతుడు హత్య కేసులో నిందితుడు

బొమ్మనహాళ్‌: హత్య కేసులో నిందితుడు దారుణహత్యకు గురయ్యాడు. కొలగానహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలగానహళ్లికి చెందిన కావలి శ్రీకాంత్‌ అనే యువకుడు 2021 సంవత్సరంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో కావలి రమేష్‌ (50) ఏ2 నిందితునిగా ఉన్నాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో రమేష్‌ వర్గీయులతో పాటు శ్రీకాంత్‌ వర్గీయులను పోలీసులు స్టేషన్‌లో బైండోవర్‌ చేశారు. గొడవల జోలికి పోకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి పంపించేశారు. సాయంత్రం రమేష్‌ లింగదహాళ్‌లోని ఎరువుల షాప్‌కు వెళ్లి వస్తానని ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అయితే రాత్రి ఎనిమిది గంటల సమయంలో రమేష్‌ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం రూరల్‌ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారణ చేశారు. ప్రత్యర్థులు ఎవరో కాపు కాసి వేటకొడవళ్లతో నరికి చంపిన చంపినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. రమేష్‌కు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. హతుడికి భార్య రాధమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో గొడవలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

నేడు కలెక్టరేట్‌లో  ‘పరిష్కార వేదిక’ 
1
1/4

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

నేడు కలెక్టరేట్‌లో  ‘పరిష్కార వేదిక’ 
2
2/4

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

నేడు కలెక్టరేట్‌లో  ‘పరిష్కార వేదిక’ 
3
3/4

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

నేడు కలెక్టరేట్‌లో  ‘పరిష్కార వేదిక’ 
4
4/4

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement