ఇంటర్ జనరల్ ప్రాక్టికల్స్ షురూ
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులకు ఆదివారం ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 62 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. ఉదయం పరీక్షలకు 2,904 మంది విద్యార్థులకు గాను 2,847 మంది హాజరయ్యారు. 57 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షలకు 2,008 మంది విద్యార్థులకు గాను 1,967 మంది హాజరయ్యారు. 41 మంది గైర్హాజరయ్యారు.
● అలాగే ఒకే ఒకేషనల్ విద్యార్థులకు రెండో స్పెల్‌లో 9 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఉదయం విడత పరీక్షలకు 1,086 మంది విద్యార్థులకు గాను 981 మంది హాజరయ్యారు. 105 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షలకు 881 మంది విద్యార్థులకు గాను 850 మంది హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఓ) వెంకటరమణనాయక్ 5 కేంద్రాలు, జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి గురువయ్య శెట్టి 8 కేంద్రాలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 8, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 9 కేంద్రాలను తనిఖీలు చేశారు.


