రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

Feb 1 2026 3:19 AM | Updated on Feb 1 2026 3:19 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

అనంతపురం సెంట్రల్‌: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యమని ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీస్‌ పరేడ్‌ మైదానం వద్ద నుంచి ర్యాలీ సాగింది. ఎస్పీ హెల్మెట్‌ ధరించి బైక్‌ నడిపారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ద్విచక్రవాహనదారులే మృతి చెందుతున్నారని, ఇందుకు ప్రధాన కారణం హెల్మెట్‌ ధరించకపోవడమేనని అన్నారు. ద్విచక్రవాహనదారులు పోలీసుల భయంతో కాకుండా బాధ్యతగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు.

బుల్లితెర నటులతో అవగాహన

రోడ్డు భద్రతపై బుల్లితెర నటులతో టవర్‌క్లాక్‌ కూడలిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నటులు సుస్మిత, ప్రభాకర్‌, పవన్‌సాయి, అనిల్‌, శ్రీరాం తదితరులు మాట్లాడుతూ రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలను ప్రజలు స్వచ్ఛందంగా పాటించాలని పిలుపునిచ్చారు.

రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న బుల్లితెర నటులు

హెల్మెట్‌ ధరించి ద్విచక్రవాహనం నడుపుతున్న ఎస్పీ జగదీష్‌

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం 1
1/1

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement