గంజాయి విక్రేతల అరెస్టు
యాడికి: మండలంలోని కోనుప్పలపాడు గ్రామ శివారులో కోన క్షేత్రంలోని రామలింగేశ్వరస్వామి సన్నిదానంలో గురువారం గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ీస్థానిక పోలీసుస్టేషన్‌లో సీఐ విలేకరులతో మాట్లాడారు. కోన రామలింగేశ్వరుడి ఆలయం వద్ద గంజాయిని విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో తమ సిబ్బంది అక్కడికి వెళ్లారన్నారు. అక్కడ గుత్తికి చెందిన అజయ్‌రాజ్, అజయ్‌వర్మ పట్టుబడ్డారని, మరో నలుగురు పరారైనట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.


