కుష్టుపై అవగాహన కల్పించాలి
అనంతపురం అర్బన్: కుష్టు వ్యాధిపై సంపూర్ణంగా అవగాహన కల్పించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమ ఫ్లెక్సీ, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు కుష్టు వ్యాధిపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించడం కోసం ‘స్పర్శ‘ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కుష్టు, హెచ్‌ఐవి ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ జయలక్ష్మి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ పాల్ సెల్వరాజ్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున్‌రెడ్డి, పారామెడికల్ అధికారి నాగన్న, స్టాటిస్టికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, డీటీసీ వీర్రాజు, పౌర సరఫరా డీఎం రమేష్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శేష వాహనంపై
కొండమీద రాయుడు
బుక్కరాయసముద్రం: కొండమీదరాయుని బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి కొండమీద రాయుడు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు శ్రీవారికి మంగళ హారతులు పట్టారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఏడు బార్లకు రీ నోటిఫికేషన్
అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఏడు బార్లకు రీ నోటిఫికేషన్ వెలువడినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. అనంతపురం నగరపాలకసంస్థ పరిధిలో మూడు బార్లు, గుంతకల్లు మున్సిపాలిటీలో రెండు, తాడిపత్రి, రాయదుర్గం మున్సిపాలిటీల్లో ఒకటి చొప్పున మొత్తం ఏడు బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. abrbc.gov.in వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకొని, రూ.5 లక్షలు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ రుసుం డీడీ ద్వారా చెల్లించి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తుకు గడువు ఫిబ్రవరి 4 అని, 5న కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. సందేహాలుంటే జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్‌లో ఉపాధ్యాయుడి ప్రతిభ
పుట్లూరు: మండలంలోని శనగలగూడూరు గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉమాపతి మహేష్‌కుమార్ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచారు.ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఈ నెల 27న రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. షాట్‌ఫుట్, డిస్క్ త్రోలో వెండి పతకాలు, జావెలెన్ త్రోలో కాంస్య పతకాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఉమాపతిని హెచ్‌ఎం హనుమంతరెడ్డి, ఎంఈఓలు శ్రీదేవి, ప్రేమ్‌కుమార్ అభినందించారు.
సంకల్పమే విజయానికి నాంది
ఆత్మకూరు: ఈ నెల 27న నెల్లూరులోని సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్‌లో ఆత్మకూరుకు చెందిన డిగ్రీ విద్యార్థి ఓరగంటి వినయ్‌కుమార్ ప్రతిభ చాటాడు. షాట్‌పుట్ విభాగంలో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. ప్రతిభ చాటిన వినయ్‌కుమార్‌ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఏపీ సెక్రటరీ రామస్వామి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షుడు నాగరాజు అభినందించారు.
కుష్టుపై అవగాహన కల్పించాలి
కుష్టుపై అవగాహన కల్పించాలి


