టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం సిటీ: జనవరిలో జరగనున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ)–2026లో డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలకు సంబంధించి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలు, బోర్డులు జారీ చేసిన ఉత్తీర్ణత సర్టిఫికెట్లు కలిగిన వారు లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి పరీక్షల డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ అమరావతి వారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఏడో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు లోయర్ గ్రేడ్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులన్నారు. లోయర్ గ్రేడ్ టెక్నికల్ లేదా అందుకు సమానమైన ఉత్తీర్ణత సాధించిన వారు సంబంధిత హయ్యర్ గ్రేడ్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులన్నారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 27లోగా ఫీజు చెల్లించాలని డీఈఓ తెలిపారు. రూ.50 ఫైన్‌తో జనవరి 3లోగా, రూ.75 జరిమానాతో అదే నెల 6వ తేదీలోగా చెల్లించవచ్చన్నారు. ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించి, అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వాటిని జనవరి 6వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు www. bse.ap.gov.in వెబ్‌సైట్ చూడాలన్నారు.


