కనువిప్పు కలిగించే సంతకం
న్యూస్‌రీల్
టమాట కిలో రూ.30
కక్కలపల్లి మార్కెట్‌లో బుధవారం కిలో టమాట గరిష్ట ధర రూ.30, కనిష్టం రూ.12, సరాసరి రూ.24 చొప్పున క్రయవిక్రయాలు జరిగాయి.
చీనీ టన్ను రూ.19 వేలు
అనంతపురం మార్కెట్ యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.19 వేలు, కనిష్టం రూ.8 వేలు పలికాయి.
●వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ పోరుబాట ●జిల్లాలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతం ●నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రానికి చేరిన సంతకాల ప్రతులు
గురువారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
అనంతపురం అర్బన్‌లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాల ప్రతుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న అనంత వెంకటరామిరెడ్డి, చిత్రంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌రెడ్డి
ఉరవకొండలో సేకరించిన సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో జిల్లా కేంరద్రానికి తరలించేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి తదితరులు
అనంతపురం: ప్రజలకు అత్యాధునిక వైద్యం.. పేదలకు డాక్టర్ కలను దూరం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందుకు పన్నిన కుట్రపై వైఎస్సార్‌సీపీ సమరశంఖం పూరించింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రెండు నెలలపాటు ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేసి సంతకాలు సేకరించారు. ప్రజాప్రయోజనాలను పక్కనపెట్టి తన అనుయాయులకు లబ్ధి చేకూర్చడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, యువత, మేధావులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రజా క్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలిగించేలా ముందుకొచ్చి మరీ సంతకాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంత మైంది. నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాల ప్రతులను జాగ్రత్తగా బాక్సుల్లో భద్రపరిచి, బుధవారం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ నెల 15న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
అనంతపురం అర్బన్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ విజయవంతంగా ముగిసింది. బుధవారం అనంత క్యాంప్ కార్యాలయం నుంచి సంతకాల ప్రతులను జిల్లా కార్యాలయానికి తరలించారు. అంతకు ముందు క్యాంప్ కార్యాలయం వద్ద సంతకాల ప్రతులను ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాక్సుల్లో ఉంచారు. ఆ తర్వాత ప్రత్యేక వాహనంలో వాటిని ఉంచి భారీ బైక్ ర్యాలీతో వెళ్లారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు మీసాల రంగన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉరవకొండలోని పొట్టిశ్రీరాములు సర్కిల్ వద్ద కోటి సంతకాల ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోనే రికార్డు స్థాయిలో 62 వేల సంతకాలు సేకరించామని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు తాడిపత్రి రమేష్‌రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాయలసీమ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రణయ్‌రెడ్డి పాల్గొన్నారు.
రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా బాక్సులను జిల్లా కేంద్రానికి తరలించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, విశిష్ట అతిథిగా పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, ఎస్‌ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం దిగ్విజయంగా ముగిసింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 40 వేల సంతకాల సేకరణ పూర్తయినట్లు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను బుధవారం ర్యాలీగా జిల్లా కేంద్రానికి తరలించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి పార్టీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. తాడిపత్రిలో 40 వేల సంతకాలు సేకరించినట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి హాజరయ్యారు.
రాప్తాడు నియోజకవర్గంలో సంతకాల ప్రతుల వాహనాన్ని అనంతపురంలో వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి ప్రారంభించారు.
కనువిప్పు కలిగించే సంతకం
కనువిప్పు కలిగించే సంతకం
కనువిప్పు కలిగించే సంతకం
కనువిప్పు కలిగించే సంతకం


