వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యం
కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు నరేష్‌రెడ్డి, సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఆయన అనుచరులు ప్రలోభాలు పెట్టి ఒక వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ను డబ్బుకు కొనుగోలు చేశారని మండిపడ్డారు. అయినా మిగతా సభ్యులు లొంగకుండా పార్టీ కోసం నిలబడ్డారని తెలిపారు. గురువారం జరిగే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుస్తారని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ సుధీర్, ఎంఎస్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.


