వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
● లెక్కల మాస్టారుగా మారిన కలెక్టర్
కళ్యాణదుర్గం నుంచి జిల్లా కేంద్రానికి సంతకాల ప్రతులను వాహనంలో
తరలిస్తున్న సమన్వయకర్త తలారి రంగయ్య, పార్టీ నేతలు
తాడిపత్రిలో కోటి సంతకాల సేకరణ ప్రతుల బాక్సులతో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి తదితరులు
అనంతపురం నుంచి బయల్దేరిన రాప్తాడు నియోజకవర్గ సంతకాల ప్రతుల వాహనాన్ని ప్రారంభిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి
గుంతకల్లుటౌన్: పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం గుంతకల్లులోని డాక్టర్ సరోజినినాయుడు మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. తొలుత ఉపాధ్యాయులతో సమావేశమైన కలెక్టర్ సబ్జెక్టు టీచర్ల ఖాళీల గురించి హెచ్‌ఎం శంకరయ్యను ఆరా తీశారు. జిల్లాలోని హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల ఖాళీలు లేకుండా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి టెన్త్ క్లాస్ సీ–సెక్షన్‌కు వెళ్లారు. గణిత శాస్త్రంలో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు త్రికోణమితి చాప్టర్‌కు సంబంధించి ఓ ప్రాబ్లమ్‌ను బోర్డుపై వేసి.. దానిని పరిష్కరించాలని సూచించారు. అయితే బోర్డుపై ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పది నిమిషాలైనా బాలికలు ముందుకు రాలేదు. దీంతో కలెక్టరే లెక్కల మాస్టారుగా మారారు. బోర్డుపై ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసి త్రికోణమితిలో సులువైన బోధనా పద్ధతుల గురించి వివరించారు. మ్యాథ్స్‌లో పూర్‌గా ఉన్నారని, బాగా ప్రాక్టిస్ చేయించాలని మ్యాథ్స్ టీచర్ పుష్పలతను ఆదేశించారు. అనంతరం విద్యార్థుల టాయిలెట్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని ఆరగించి, మెనూ పాటి ప్రకారం వడ్డిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తరువాత కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలోని స్కూళ్లల్లో ఖాళీలను వారం రోజుల్లోపు 80 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్(విద్యా వలంటీర్ల)తో భర్తీ చేస్తామన్నారు. ఉర్దూ జూనియర్ కాలేజీల ప్రారంభంపై ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఆర్‌డీఓ శ్రీనివాస్, డీఎల్‌డీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్, ఎంఈఓ సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు.
మీ వెనకున్న కౌన్సిలర్లు ఎవరు?


