భూములు, స్థలాలు కొంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించాలి.. | - | Sakshi
Sakshi News home page

భూములు, స్థలాలు కొంటున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించాలి..

Dec 7 2025 8:33 AM | Updated on Dec 8 2025 9:22 AM

ఈ జాగ

ఈ జాగ్రత్తలు పాటించాలి

అనంతపురం అర్బన్‌: నగరం, నగర పరిధి విస్తరిస్తోంది.. జనాభాకనుగుణంగా భూములు, స్థలాల అవసరం ఏర్పడింది. భూములు, స్థలాల విలువ కూడా బాగా పెరిగిపోయింది. ఇదే అదునుగా చూసు కొని కొందరు అక్రమ మార్గంలో నడుస్తున్నారు. భూములు, స్థలాల హక్కుదారుల పేరిట నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. మరోవైపు డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూములు, స్థలాలు,ఇళ్లను కొనుగోలు చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి...అక్రమార్కుల మోసాన్ని ఎలా గుర్తించాలి..అనే అంశాలపై ‘మీకోసం’లో ‘సాక్షి’ అంది స్తోంది.

ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి..

● స్థలం కొనేప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు. బేరం మాట్లాడేప్పుడు బ్రోకర్లు వచ్చి రెచ్చ గొట్టి ఎక్కువ ధరకు కొనే విధంగా చేస్తారు.

● ఆస్తి ఎవరి పేరున ఉందనేది తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి ఈసీ (ఎన్కంబరెన్స్‌ సర్టిఫికెట్‌) తీసుకోవాలి. ● ఆస్తి కొనేముందు ఓరిజినల్‌ సేల్‌ డీడ్‌ (అసలైన డాక్యుమెంట్‌)లో ఉండే యజ మాని ఫొటోను గమనించాలి. అన్ని లింక్‌ డాక్యుమెంట్ల హిస్టరీ చూడాలి.

● సేల్‌ అగ్రిమెంట్‌ కనీసం మూడు నెలలు ఉండేలా చూసుకోవాలి. అగ్రిమెంట్‌ చేసుకునేప్పుడు డబ్బులు 5 నుంచి 10 శాతం కంటే ఎక్కువ ఇవ్వకండి. 

● ధర మాట్లాడే అప్పుడు నిజమైన యజ మానితో మాట్లాడాలి. యజమానికి సంబంధించి గుర్తింపుకార్డు అడగాలి.

● కొనుగోలు చేయబోవు స్థలం డాక్యుమెంట్లు, చిరునామా నిజమైనదా? కాదా తెలుసుకోవాలి. ● క్షేత్రస్థాయిలో స్థలం కొలతలు, డాక్యుమెంట్‌లోని కొలతల్లో తేడాలు గుర్తించాలి. ● కొందరు ఆస్తిని వేరేవాళ్లకు విక్రయించి, మన వద్ద అగ్రిమెంట్‌ చేసుకుంటారు. అగ్రిమెంట్‌ సమయంలో, రిజిస్ట్రేషన్‌ ముందు రోజు ఈసీ తీసుకోవాలి.

అవసరమైన డాక్యుమెంట్లు ఏవంటే..

  • యజమాని సేల్‌ డీడ్‌ ఒరిజినల్‌డాక్యుమెంట్‌పై స్టాంప్‌ చూడాలి. లింక్‌ డాక్యుమెంట్లు చూడాలి.

  • అన్ని డాక్యుమెంట్లలో కొనేవారు, విక్రయించేవారు ఒక్కరే కాకపోతే.. అమ్మేవారి వంశవృక్షం సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఇప్పించుకోవాలి.

  • డాక్యుమెంట్‌ మొదటి పేజీలో ఏదైనా కోర్టు సీల్‌, సంతకం ఉంటే ఆ ఆస్తి పైన కేసు ఉందని అర్థం చేసుకోవాలి.

  • ఈసీ (ఎన్కంబర్స్‌మెంట్‌ సర్టిఫికెట్‌) మదర్‌ డీడీ సర్టిఫికెట్‌, రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌, వ్యవసాయ భూమి అయితే టె నాన్సీ అండ్‌ క్రాప్‌, సర్వే స్కెచ్‌ ఉండాలి.

  • లే అవుట్‌ అప్రూవల్‌, ఖాతా ధ్రువపత్రం, డీసీ కన్వవర్షన్‌ సర్టిఫికెట్‌ (అగ్రికల్చర్‌ నుంచి నాన్‌ అగ్రికల్చర్‌ కన్వర్షన్‌), ఆస్తి పన్ను సర్టిఫికెట్‌.

  • అపార్మెంట్‌మెంట్లు, ఇళ్లు అయితే ప్లాన్‌ అప్రూవల్‌ ఉండాలి. తక్కువ ఫ్లోర్లకు అప్రూవల్‌ తీసుకొని ఎక్కువ ఫ్లోర్లు నిర్మిస్తారు. అలాంటి ఫ్లాట్లు కొంటే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది.

అప్రూవల్‌ స్థలాలు కొనాలి...
ఇటీవల అనప్రూవల్‌ వెంచర్లు చాలానే వెలుస్తునాయి. లే అవుట్‌ అప్రూవల్‌ స్థలాలను కొనుగోలు చేయాలి. లేదంటే అప్రూవల్‌ సమయంలో స్థలం విలువపై 14 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఉచితంగా భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లను ఇస్తుంది. అలాంటి వాటిని కొనుగోలు చేసినా మళ్లీ వారికే వెళతాయి. రిజిస్ట్రేషన్‌ చెల్లదు. పేదవారికి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన స్థలాలు కొనకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement