ఇటీవల వ్యవసాయశాఖ నిర్వహించిన ‘రైతన్నా.. మీకోసం’ ప్రభుత్
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో నవంబర్ 24 నుంచి 29 వరకు నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం అట్లర్ ఫ్లాప్ అయ్యింది. తొలిరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్కడక్కడా హాజరై ఫొటోలకు ఫోజులిచ్చి.. తర్వాత పత్తా లేకుండా పోయారు. చేసేది లేక మండలస్థాయి అధికారులు, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది అయిష్టంగానే మిగతా ఐదు రోజులు కొనసాగించారు. ఆరు రోజుల పాటు గ్రామాలకు వెళ్లి అధికారులు నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కింద జిల్లా వ్యాప్తంగా 442 ఆర్‌ఎస్‌కేల పరిధిలో 2,82,547 మంది రైతులను కలిసినట్లు నివేదిక తయారు చేశారు. ఇంటింటికీ వెళ్లి రైతులను కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తూనే రైతుల మొబైల్‌లో ‘ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ యాప్ డౌన్‌లోడ్ చేయించినట్లు పేర్కొన్నారు. అక్కడక్కడా ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు కొందరు మొక్కుబడిగా పాల్గొన్నారు. అలాగే ఈ నెల 3న ఆర్‌ఎస్‌కే వేదికగా వర్క్‌షాపులు నిర్వహించి కార్యక్రమాన్ని ముగించినట్లు అధికారులు ప్రకటించారు. 2026 ఖరీఫ్, రబీ, 2027 ఖరీఫ్‌కు సంబంధించి యాక్షన్ ప్లాన్‌లు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
అసంతృప్తులు.. నిలదీతలు
‘రైతన్నా మీ కోసం’ అంటూ అధికారులు గ్రామాలకు వెళ్లి పంచసూత్రాల కరపత్రం, మొబైల్ యాప్‌తో సరిపెట్టడంతో పలువురు రైతులు సమస్యలపై నిలదీసినట్లు తెలుస్తోంది. ‘రెండేళ్లవుతున్నా ఇన్‌పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా మాకు రాలేదు. పీఎం కిసాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బ్యాంకులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నా సాయం అందడం లేదం’టూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అరటి, చీనీ, వరి, వేరుశనగ, మొక్కజొన్న, పత్తి, ఆముదంకు గిట్టుబాటు ధరలు లేక పంటలను వదిలేస్తున్నామంటూ ఆక్రోశించారు. పల్లె పల్లెలోనూ రైతులు ప్రశ్నల వర్షం కురిపించడంతో నీళ్లు నమలడం మినహా అధికారులు హామీ ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ముందుగానే ఊహించిన ప్రజాప్రతినిధులు, స్థానిక చోటామోటా నాయకులు కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం. రైతుల నుంచి నిలదీతలు ఎక్కువ కావడంతో అధికారులు కూడా ఇంటింటికీ వెళ్లడం మానేసి ఓ పది మంది రైతులను గుట్టుగా పిలిపించుకుని కరపత్రాలు ఇచ్చేసి వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ ముద్ర వేసి మరికొందరు రైతులను కలవకుండానే కలిసినట్లుగా నివేదించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మున్ముందు అది చేస్తారు, ఇది చేస్తారు అంటూ అధికారులు కూడా అబద్ధాలు చెప్పి ఎలాగోలా కార్యక్రమాన్ని ముగించి ఊపిరి పీల్చుకున్నారు.
‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో అధికారులు నాతో పాటు చాలామంది రైతులను కలవనే లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈసారి అరకొరగా అన్నదాత సుఖీభవ సాయం తప్ప చేసిందేమీ లేకపోవడంతో రైతుల్లో నమ్మకం సన్నగిల్లిపోయింది. అందుకే కార్యక్రమానికి వెళ్లడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు.
– ఎం.నారాయణస్వామి,
ఎల్లుట్ల, పుట్లూరు మండలం
రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఇటీవల నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనమూ లేదు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో చాలామంది రైతులు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రూ.80 వేలు పెట్టుబడి పెట్టి 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినా ధరల్లేక తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. రైతన్నా మీ కోసంలో న్యాయం చేస్తామన్న వాళ్లు మళ్లీ కనిపించడం లేదు.
– గొల్ల నారాయణస్వామి, ముద్దలాపురం
ఫలితమివ్వని ‘రైతన్నా మీ కోసం’
తొలిరోజు ఫొటోలకు ఫోజులిచ్చి తర్వాత కనిపించని ప్రజాప్రతినిధులు
రైతులకు సాయమందించకున్నాప్రచారం కోసం రూ.కోట్లు వెచ్చించిన సర్కారు
ఇటీవల వ్యవసాయశాఖ నిర్వహించిన ‘రైతన్నా.. మీకోసం’ ప్రభుత్
ఇటీవల వ్యవసాయశాఖ నిర్వహించిన ‘రైతన్నా.. మీకోసం’ ప్రభుత్
ఇటీవల వ్యవసాయశాఖ నిర్వహించిన ‘రైతన్నా.. మీకోసం’ ప్రభుత్


