కడుపు మంటతో మాట్లాడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

కడుపు మంటతో మాట్లాడుతున్నారు

Dec 5 2025 6:41 AM | Updated on Dec 5 2025 6:41 AM

కడుపు మంటతో మాట్లాడుతున్నారు

కడుపు మంటతో మాట్లాడుతున్నారు

అనంతపురం ఎడ్యుకేషన్‌: తోపుదుర్తి కుటుంబం వైపు జనం ఉన్నారని కడుపు మంటతో ఎమ్మెల్యే పరిటాల సునీత తనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం వైస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తోపుదుర్తిలో తాను గతంలోనే మంజూరు చేయించిన సబ్‌స్టేషన్‌ను ఇప్పుడు ఎమ్మెల్యే ప్రారంభించి బిల్డప్‌ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు చెన్నేకొత్తపల్లి, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేయిస్తామని చెప్పించి.. తోపుదుర్తి రిజర్వాయర్‌ గురించి ప్రస్తావన తేలేదని, అంటే ఈ రిజర్వాయర్‌ను రద్దు చేయించాలనే కదా నీ ఉద్దేశమని నిలదీశారు. అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటలో ప్రజలను బెదిరించి కాలనీలను కొట్టేయాలని పరిటాల కుటుంబం చూసిందని ధ్వజమెత్తారు. రాప్తాడు, అనంతపురం రూరల్‌ మండలాల్లో మట్టిని అమ్ముకోవడం, క్రషర్ల వద్ద, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద డబ్బులు వసూళ్లు చేస్తూ, పంచాయతీలకు రావాల్సిన పన్నులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆత్మకూరు మండలానికి మీరేమి చేశారని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి.. చంద్రబాబును తిట్టారని మూడేళ్ల నుంచి అదే వీడియోను తిప్పితిప్పి చూపిస్తున్నారన్నారు. అప్పట్లో దీనికి ముందురోజు పరిటాల శ్రీరామ్‌ ‘అయ్యా ప్రకాష్‌రెడ్డి.. నువ్వు గడపగడపకూ తిరుగుతున్నావు. కొండారెడ్డి హత్య కేసులో ముద్దాయిలు నిన్ను చంపితే మాకు సంబంధం లేదు’ అని మాట్లాడాడని గుర్తు చేశారు. ఇలాంటి వారిని వెనుకేసుకొస్తున్నది చంద్రబాబే కదా అని తోపుదుర్తి చందు మాట్లాడారన్నారు. ‘ఆయన మాట్లాడిన భాష తప్పే. ఉద్దేశం మాత్రం ఇదే’ అని అప్పుడే తాను వివరణ కూడా ఇచ్చానన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయించడం వెనుక పరిటాల శ్రీరామ్‌ ఉన్నాడని ఆరోపించారు.

మహిళలకు ఏమి రక్షణ కల్పించారు?

రాప్తాడు నియోజకవర్గంలోని మహిళలకు ఏమి రక్షణ కల్పించారో ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పాలని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వేధింపులకు గురైతే పోలీసులు న్యాయం చేయలేదన్న బాధతో చెన్నే కొత్తపల్లికి చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుందన్నారు. రాప్తాడులో సావిత్రమ్మ అనే మహిళను అధికార పార్టీ వాళ్లే చంపించారని, మీ ఊరి పక్కనే దళిత బాలికను గ్యాంగ్‌రేప్‌ చేస్తే కనీసం పరామర్శించిన పాపాన పోలేదని నిలదీశారు. గరిమాకులపల్లిలో అంగన్‌వాడీ టీచరును ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి కొడితే కనీసం మాట్లాడలేకపోయారన్నారు. ‘మజ్జిగ లింగమయ్య హత్యతో మొదలైన నీ పతనం పాపంపేటలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌తో సంపూర్ణమైంద’ని పేర్కొన్నారు.

‘జాకీ’పై ప్రమాణానికి సిద్ధమా..?

‘నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో 2018లోనే జాకీ పరిశ్రమ తరలిపోయిందని ఆనాడే ‘సాక్షి’ పత్రిక రాసింది. ఆ జాకీ పరిశ్రమ నువ్వు ఉన్నప్పుడు వెళ్లిపోయిందా? నేను వచ్చిన తర్వాత వెళ్లిపోయిందా? అనే దానిపై కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమా?’ అని పరిటాల సునీతకు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఇళ్ల నిర్మాణాల్లో రూ.80 కోట్లు తాను తిన్నానని మాట్లాడే ప్రతి ఒక్కరిపైనా పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, లోకనాథరెడ్డి, సాకే వెంకటేశు, మీనుగ నాగరాజు, మల్లికార్జున, పోతులయ్య, నీరుగంటి నారాయణరెడ్డి, బాలపోతన్న, సనప గోపాల్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, బిల్లే పెదయ్య పాల్గొన్నారు.

నేను తీసుకొచ్చిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి బిల్డప్పా..?

జాకీ పరిశ్రమ ఎవరి హయాంలో పోయిందో ప్రమాణం చేద్దామా..!

పరిటాల సునీతపై తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement