రాష్ట్రంలో హామీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం
ఉరవకొండ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్యాన్ని పారిస్తూ సీఎం చంద్రబాబు తన సొంత జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక యువత నిరాశకు గురవుతున్నారన్నారు. పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ ఉద్యమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేశవరెడ్డి, సీపీఐ తాలుకా కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి చండ్రాయుడు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీప్రసాద్, నాయకులు గన్నేమల్లేసు, పురిడి తిప్పయ్య, శ్రీధర్, శ్రీరాములు, రమణ, బసవరాజు, ప్రసాద్, నారాయణమ్మ, మల్లారాయుడు, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.


