ఘనంగా ధ్వజారోహణ, అంకురార్పణ
● నేడు హనుమద్ వ్రతం
మడకశిరరూరల్: భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా ధ్వజారోహణ, అంకురార్పణ చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బెంగళూరుకు చెందిన హనుమంతయ్య, రామాంజనప్ప వారి కుటుంబ సభ్యులచే, ఆంజినేయస్వామి ఆలయంలో గోవిందరాజులు, రత్నమ్మ కుటుంబ సభ్యులచే ధ్వజారోహణ, అంకురార్పణ, అగ్నిహోత్ర, హోమం తదితర కార్యక్రమాలను పురోహితులు నిర్వహించారు. స్వామివార్లకు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేశారు. అదే విధంగా రొళ్ల జెడ్పీటీసీ అనంతరాజు కుటుంబ సభ్యులు స్వామి వార్లకు పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, సర్పంచులు కరియన్న, రామాంజినేయులు, ఈఓ నరసింహరాజు, కమిటీ చైర్మన్ నర్సేగౌడ్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు వ్రతం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయాల్లో స్వామి వార్లకు మన్యసూక్త పవమాన హోమం, హనుమద్‌వ్రతం, అభిషేకం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు.


