రైతాంగం పరిస్థితి అగమ్యగోచరం
బెళుగుప్ప: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఫలితంగా రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. బెళుగుప్ప మండలం యలగలవంకలో పార్టీ నేతలతో కలసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్కెట్‌లో మొక్కజొన్న, కంది, అరటి తదితర పంటలకు సరైన ధరలు లేక రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్నకు క్వింటా రూ.2400 మద్దతు ధరను ప్రకటించిన ప్రభుత్వం... కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా మోసం చేసిందన్నారు. ఫలితంగా క్వింటా రూ.1,700కు మించి దళారులు కొనుగోలు చేయడం లేదన్నారు. ఇదే తరహాలో కంది, అరటి రైతులు దగా పడ్డారన్నారు. పాలకుల వైఫల్యం కారణంగా వరి, పత్తి రైతులు కూడా నష్టపోతున్నారని తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను లక్షలాది మంది రైతులు సద్వినియోగం చేసుకున్నారని, చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రస్తుతం 19 లక్షల మంది కూడా పంటల బీమా ప్రీమియంను చెల్లించలేదన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, సబ్సిడీ విత్తన పంపిణీకి చంద్రబాబు సర్కార్ మంగళం పాడిందన్నారు. అధికారం చేపట్టకు ముందు ఒక మాట చేపట్టిన తర్వాత మరో మాట మాట్లాడడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. ఇప్పటికై నా రైతులను ఆదుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిది సీపీ వీరన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శివలింగప్ప, మండల కన్వీనర్ చిన్న మచ్చన్న, యువజన విభాగం మండల ఉపాధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి తిమ్మారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడుసురేష్, సర్పంచ్ మారుతి, నాయకులు శీనప్ప, వెంకటేశులు, పాతన్న, వెంకటేశులురెడ్డి, పూల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆదుకోవడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలం
వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ


