కేశవా.. విద్యార్థుల ఇక్కట్లు కానవా!
కూడేరు: ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు విద్యార్థుల సమస్యలు పట్టడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావొస్తున్నా.. బడి పిల్లలు ఇంకా మండుటెండలోనే పాఠాలు వల్లె వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇందుకు నిదర్శనమే కూడేరు మండలం ఉదిరిపికొండ తండాలోని ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 64 మంది విద్యార్థులున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే తరగతి గదులు కేవలం మూడే ఉన్నాయి. దీంతో 2, 4వ తరగతులను ఆరు బయట నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పటికైనా మంత్రి కేశవ్ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.


