బాలికలు అన్ని రంగాల్లో విజయం సాధించాలి
గార్లదిన్నె: బాలికలు అన్ని రంగాల్లో విజయం సాధించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ అరుణకుమారి పిలుపునిచ్చారు. శనివారం మండల గార్లదిన్నెలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికల రక్షణ, విద్య, చట్టాలు, బాలికలకు ఉన్న అవకాశాలుపై శిక్షణ నిర్వహించారు. ప్రాజెక్టు డైరెక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ బాలికలకు భరోసా ఇవ్వగలిగితే వారు ఎంతటి క్లిష్టమైన లక్ష్యాన్నైనా సునాయాసంగా చేరుకోగలరని, జీవితంలో స్థిరపడగలరని అన్నారు. బాలికల్లో ప్రతిభను వెలికి తీయడానికి పాటల పోటీలు, డ్రాయింగ్ వకృత్వ పోటీలు నిర్వహించి, సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్‌ఐ సురేంద్రబాబు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శైలజ, చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా సమన్వయకర్త కృష్ణమాచారి, ఎంపీడీఓ యోగానందరెడ్డి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శ్రీవాణి, నిర్మల, కేజీబీవీ ఎస్‌ఓ నాగసత్య, తదితరులు పాల్గొన్నారు.


