క్రీడల్లో మేటిగా రాణించాలి
అనంతపురం కార్పొరేషన్: అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మేటిగా రాణించాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న డాక్టర్ తాలిమెరాన్ ఏఓ ఆల్ ఇండియా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా కేరళ, గోవా జట్ల మధ్య జరిగిన్ మ్యాచ్‌లో క్రీడాకారులను కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులందరూ క్రీడా స్పూర్తితో ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో పుట్‌బాల్ అసోసియేషన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రేపు కలెక్టర్ దృష్టికి అరటి రైతుల సమస్యలు
శింగనమల: నియోజకవర్గంలోని అరటి రైతుల సమస్యలను సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ తెలిపారు. అరటి ధరలు పాతాళానికి పడిపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రైతులను ఆదుకోవాలని మరోసారి కలెక్టర్‌కు విన్నవించనున్నట్లు పేర్కొన్నారు. శింగనమల నియోజకవర్గంలోని రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో ఇంటర్ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు వివిధ అంశాల్లో డిసెంబర్ ఒకటి నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీడాప్ జాబ్స్ జిల్లా కో–ఆర్డినేటర్ శైలజ శనివారం తెలిపారు. 19 నుంచి 26 ఏళ్లలోపు వయస్సు కలిగిన యువతీ యువకులు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా 90 రోజుల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికై న వారికి ఉచిత భోజనం, వసతితో పాటు యూనిఫాం ఇవ్వనున్నట్లు వివరించారు.
క్రీడల్లో మేటిగా రాణించాలి


