ప్రతిష్టాత్మకంగా కోటి సంతకాల సేకరణ
అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ మండలాల పరిశీలకులు, కన్వీనర్లు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ కమిటీల నియామకం, అనుబంధ కమిటీల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ కోటి సంతకాల సేకరణ విజయవంతంగా పూర్తి చేయడానికి మండల నేతల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎంపీపీ నారాయణరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్ కుమార్, కరణం భీమరెడ్డి, మండల కన్వీనర్లు రమేష్, మచ్చన్న, సోమశేఖర్ రెడ్డి, ఈడిగ ప్రసాద్, రామచంద్రారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


