బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే
అనంతపురం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మాజ్యోతిరావు పూలే అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతిని స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి ‘అనంత’తో పాటు పార్టీ నేతలు ఘన నివాళుర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలకు విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పిన మహనీయుడు జోత్యిబాపూలే అని కొనియాడారు. మహాత్మాజ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా జనరంజక పాలన చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తన కేబినెట్‌లో ఏకంగా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు కల్పించి పెద్దపీట వేశారన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఏకంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకురావడంతో పాటు బీసీ, ఎస్సీ,ఎస్టీ కేటగిరీ విద్యార్థుల డాక్టర్ కల సాకారం అయ్యేలా గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రశంసించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థుల డాక్టర్ కలను ఛిద్రం చేస్తోందని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడిచారన్నారు. వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీ మహిళల ఖాతాల్లోకి నేరుగా నగదు చెల్లింపులు జరిపి ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారని కొనియాడారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన బాటలో నడిచి బీసీల కోసం అనేక సంస్కరణలు తెచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి బీసీలు రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాలు బ్యాక్‌వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ అంటూ అగ్రస్థానంలో నిలిపిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇంగ్లిష్ మీడియం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో బీసీలకు చేయూతనిచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మీసాల రంగన్న, అశ్వర్థనాయక్, పెన్నోబులేసు, చింతా సోమశేఖర్ రెడ్డి, జానీ, వెన్నం శివారెడ్డి, శ్రీదేవి, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, అమరనాథ రెడ్డి, కృష్ణవేణి, సాకే చంద్రలేఖ, భారతి, రాధా యాదవ్, అంజిలి, ఉష, మహేశ్వరి, మదన్‌మోహన్ రెడ్డి, కమల్‌భూషణ్, వెన్నపూస రామచంద్రా రెడ్డి, రాధాకృష్ణ, ఓబిరెడ్డి, సంపంగి రామాంజినేయులు, శేఖర్ బాబు, వేణుగోపాల్, గుజ్జల శివయ్య, అనిల్ కుమార్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, లక్ష్మన్న, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌బాబా సలామ్ తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు మాజీ సీఎం జగన్ ఎంతో కృషి
కేబినెట్‌లో 17 మంత్రి పదవులతో
పాటు అన్నింటా బడుగులకు ప్రాధాన్యం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి


