సేవాభావంతో పని చేసిన ‘రాక్రీట్‌’పై నిందలా? | - | Sakshi
Sakshi News home page

సేవాభావంతో పని చేసిన ‘రాక్రీట్‌’పై నిందలా?

Nov 28 2025 8:31 AM | Updated on Nov 28 2025 8:31 AM

సేవాభావంతో పని చేసిన ‘రాక్రీట్‌’పై నిందలా?

సేవాభావంతో పని చేసిన ‘రాక్రీట్‌’పై నిందలా?

అనంతపురం ఎడ్యుకేషన్‌: నిరుపేదలకు మూడు సెంట్ల స్థలంలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీని అమలు చేయలేక నేడు ప్రతిపక్షంపై నిందలు మోపుతున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో కేంద్రం నుంచి 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించారని, 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. రూ.1.80 లక్షల యూనిట్‌ వ్యయంతో పేదలకు ఇళ్లు నిర్మించాలని గత ప్రభుత్వంలో పెద్దపెద్ద కాంట్రాక్టర్లను అడిగితే ఎవరూ ముందుకురాలేదన్నారు. ఆ తరుణంలో ‘రాక్రీట్‌’ సంస్థ సేవాభావంతో పనులు చేసిందన్నారు.ఆప్షన్‌–3 లబ్ధిదారులకు ఆర్సీ లెవల్‌ వరకు మాత్రమే ఇళ్లు నిర్మించి ఇస్తామని ఒప్పందం చేసుకుందని, తక్కిన పనులకు లబ్ధిదారులు రూ.35 వేలు భరించాల్సి ఉందన్నారు. ఈ పనులు కూడా రాక్రీట్‌ చేపట్టాల్సి ఉందంటూ నిందలు వేస్తున్నారని వాపోయారు. ఒప్పందం మేరకు ఇళ్లు నిర్మిస్తామంటూ రాక్రీట్‌ సంస్థ అనేకమార్లు కలెక్టర్లు, హౌసింగ్‌ డైరెక్టరు, జిల్లా అధికారులకు లేఖలు రాసిందని తెలిపారు. కేవలం తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 50 వేల కుటుంబాలను నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ రూ.36 కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉందని, దీనిపై కోర్టుకు వెళ్తే ప్రభుత్వం కనీసం కౌంటరు దాఖలు చేయలేదని విమర్శించారు. బీజేపీ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందన్నారు.

ఆప్షన్‌–3 బెస్ట్‌ ఆప్షన్‌

ఆప్షన్‌–3 కింద చేపట్టిన 3 లక్షల ఇళ్లలో 2 లక్షల ఇళ్లు పూర్తి చేశారంటే దాదాపు 70 శాతం సక్సెస్‌ రేటు అన్నారు. 1,2 ఆప్షన్లలో 18 లక్షల ఇళ్లకు గాను 6 లక్షలు మాత్రమే పూర్తయినట్లు హౌసింగ్‌ మంత్రి చెబుతున్నారని, అంటే 33 శాతం మంది మాత్రమే కట్టుకున్నారని తెలిపారు. ఈ 6 లక్షల మంది కనీసం చేతినుంచి ఒక్కొక్కరు అదనంగా రెండు లక్షల దాకా పెట్టుకున్నా రన్నారు. ఈ లెక్కన రూ. 12 కోట్లు నష్టపోయారన్నారు.తక్కిన 12 లక్షల మంది కూడా ఇళ్లు నిర్మించుకోవాలంటే మరో రూ. 24 కోట్లు నష్టపోవాల్సి వస్తుందన్నారు. 70 శాతం సక్సెస్‌ రేటున్న ఆప్షన్‌–3 ఇళ్ల గురించి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్‌, రాప్తాడు వైస్‌ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ నాయకులు మీనుగ నాగరాజు, నారాయణరెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

3 సెంట్లలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది

అధికారంలోకి వచ్చాక

పూర్తిగా పక్కన పెట్టింది

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement