ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ అంటూ భక్తులు చేసిన నామస్మరణతో జిల్లా మార్మోగింది. కార్తీక మాస చివరి సోమవారాన్ని పురస్కరించుకుని పోటెత్తిన భక్తులతో పరమేశ్వరుడి ఆలయాలు కిటకిటలాడాయి. మహాదేవుడిని మనసారా కొలిచిన భక్తులు ఆలయ ఆవరణాల్లో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. బుక్కరాయసముద్రం మండలం ముసలమ్మ కట్ట వద్ద ఉన్న కాశీవిశ్వేశ్వర ఆలయంలో గంగా హారతి సందర్భంగా సందడి నెలకొంది. ఆద్యంతం భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ


