వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పెద్ద కుట్ర
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పెద్ద కుట్ర అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. సోమవారం స్థానిక జేఎన్‌టీయూ సమీపంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా విద్యార్థులు, యువత సంతకాలు చేయడంతో పాటు చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం పట్ల వారి అభిప్రాయాలను సైతం రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాబు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వ వైద్య కళాశాలల విషయంలో వైఎస్ జగన్ ఆలోచన చాలా గొప్పదని పలువురు అభిప్రాయపడగా, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కొంతమంది రాయడం గమనార్హం. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజన్ ఉన్న నాయకుడన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలని, ఆ కళాశాలకు అనుబంధంగా సూపర్‌స్పెపాలిటీ ఆస్పత్రి ఉండాలని భావించి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా రాష్ట్రానికి కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. మూడేళ్లలో ఏడు మెడికల్ కళాశాలలను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారన్నారు. తక్కిన 10 కళాశాలలు 30 నుంచి 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజా ఆస్తినంతటినీ ప్రైవేట్‌కు ధారాదత్తం చేయాలని కుట్ర పన్నిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టమే గొప్పదని, మెడికల్ కళాశాలల అంశంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. ఖాకీ జులుం ప్రజలపై చూపించినా, పార్టీ ముసుగులో దౌర్జన్యాలు చేయాలని చూసినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి, అమర్‌నాథరెడ్డి, ఇంటలెక్చువల్ ఫోరం శంక రయ్య, దాసిరెడ్డి, తానీషా, నాయకులు నాగార్జున రెడ్డి, కార్పొరేటర్ సంపంగి రామాంజనేయులు, మోక్షిత్ సుబ్బారెడ్డి, నిజాముద్దీన్, హరి, లబ్బే రాఘవ, ఎగ్గుల శ్రీనివాసులు, ఫయాజ్, స్థానిక నాయకులు కుడేటి మహేష్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు, విజయ్ కుమార్, ప్రతాప్, సాయిచరణ్, దత్త, ప్రభాకర్, చంద్రమోహన్‌రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు మేలు చేయాలనే
వైఎస్ జగన్ ఆలోచన గొప్పది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంత వెంకటరామిరెడ్డి
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పెద్ద కుట్ర
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ పెద్ద కుట్ర


