తుపాన్ ఆపగలిగిన వారు మెడికల్ కాలేజీలు కట్టలేరా?
అనంతపురం: ‘‘సీఎం చంద్రబాబు మోంథా తుపాన్ ఆపారని టీడీపీ నేతలు ఊదరగొడుతున్నారు. మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలవడానికి మంత్రి లోకేష్ స్ఫూర్తి అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. మరి అలాంటి వారు ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తి చేసేందుకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా’’ అని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రశ్నించారు. అనంతపురం నగరంలో గురువారం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డితో పాటు బైరెడ్డి సిద్దార్థరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు. అధికారంలోకి వచ్చిన 17 నెలల వ్యవధిలోనే రూ.2.27 లక్షల కోట్ల అప్పు చేశారని, ఇందులో రూ.5 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పూర్తి చేయడానికి మనసు రావడం లేదా అని నిలదీశారు. ఎన్నికల సమయంలో కుట్రలు చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. తమ పార్టీ అధినేతపై ఏ మాత్రమూ ప్రజాభిమానం తగ్గలేదన్నారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సూపర్‌సిక్స్ అనేది పెద్ద మోసమని తేటతెల్లమైందన్నారు. పీపీపీ టెండర్లలో పాల్గొని మెడికల్ కళాశాలలను దక్కించుకున్నా మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేస్తానని వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని, ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలపై కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, రామాంజి, రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతినాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకనాథ రెడ్డి, యాదవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ హరీష్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ కాగజ్ ఘర్ రిజ్వాన్, సీనియర్ నేత అనంత చంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, అనంతపురం పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, అమరనాథ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఫయాజ్, సైఫుల్లాబేగ్, మహిళా నాయకులు బి. శ్రీదేవి, చంద్రలేఖ, కృష్ణవేణి, భారతి, అంజలి, మహేశ్వరి, ఖమర్ తాజ్, రాధా, హజరాంభి, లీలావతి, పెన్నోబులేసు, కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, బాకే హబీబుల్లా, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులు దాదాఖలందర్, ప్రతాప్, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సాకే శ్రీనివాసులు, మహేష్, యువజన విభాగం గుంతకల్లు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్, కళ్యాణదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు చరణ్, ఉరవకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బసవన్న గౌడ, నగర అధ్యక్షుడు శ్రీనివాస దత్త, ఉపాధ్యక్షులు వినీత్, ఉదయ్, కార్యదర్శులు మసూద్, మైను, జిల్లా కార్యదర్శి హిద్దు, మల్లెల వేణు, బ్రహ్మానందరెడ్డి, రామయ్య, సాకే కుళ్లాయిస్వామి తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాలు చేస్తున్న నగర ప్రజలు, యువకులు
ఇప్పటికైనా మేల్కోండి బాబూ
సీఎం చంద్రబాబు అస్మదీయుల కోసమే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడం కోసం రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. బాబు అధికారంలోకి వచ్చాక తన సొంత మనుషులకు మెడికల్ కళాశాలలను కట్టబెట్టడానికి ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజా ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే కోటి సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందిస్తామన్నారు. ఎన్నికల్లో కూటమి పార్టీలకు మద్దతు తెలిపిన వారు కూడా కోటి సంతకాల్లో భాగస్వాములవుతున్నారని, బాబు ఇప్పటికైనా మేల్కొని తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.
లక్షల కోట్ల అప్పుల్లో నుంచి
నిధులు కేటాయించలేరా?
సూపర్‌సిక్స్ అనేది పెద్ద మోసం
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
తుపాన్ ఆపగలిగిన వారు మెడికల్ కాలేజీలు కట్టలేరా?
తుపాన్ ఆపగలిగిన వారు మెడికల్ కాలేజీలు కట్టలేరా?
తుపాన్ ఆపగలిగిన వారు మెడికల్ కాలేజీలు కట్టలేరా?
తుపాన్ ఆపగలిగిన వారు మెడికల్ కాలేజీలు కట్టలేరా?


