తమ కష్టానికి ‘గిట్టుబాటు ధర’ లభించడం లేదు. కుటుంబ పోషణ
అనంతపురం అగ్రికల్చర్: చేనేతలకు చంద్రబాబు ప్రభుత్వం శఠగోపం పెడుతోంది. రైతులను చిన్నచూపు చూసినట్లుగానే నేతన్నలపై కూడా చంద్రబాబు కరుణ చూపే పరిస్థితి కనిపించడం లేదు. అధికారం చేపట్టి 17 నెలలవుతున్నా ఏ రూపంలోనూ నయా పైసా సాయం చేయలేదు. నేత కార్మికులకు కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇచ్చిన పాపానపోలేదు. గతంలో మాదిరిగా పింఛన్లు ఇస్తుండటం మినహా వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు.
ఆత్మహత్యలే శరణ్యం..
ఉపాధి లేక బతుకులు దుర్భరంగా మారి చేనేతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో ఇరువురు కార్మికులు చేతిలో పనిలేక, ఉపాఽధి లభించక, అప్పులు తీర్చలేక, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, పోషణ భారమై ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబాలు రోడ్డున పడిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల కుటుంబాలకు పైగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అందులో మొదటి స్థానంలో శ్రీ సత్యసాయి జిల్లా ఉండగా ఆ తర్వాత 9,500 మందితో అనంతపురం జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలోని తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు తదితర ప్రాంతాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. ప్రభుత్వ సాయం, ప్రోత్సాహం లేక వారంతా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చేయూత లేక చేనేత సొసైటీలు నిర్వీర్యం కాగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇక.. ఇటీవల వరుస వర్షాలతో మగ్గం గుంతల్లో నీరు చేరి నేతన్నలు ఉపాధి కోల్పోయారు. బతకడమే కష్టమవుతున్న పరిస్థితుల్లో కుటుంబ పోషణ భారమై రోజు కూలీలుగా ఇతర పనులకు వలస వెళ్లే దుర్భరపరిస్థితులు నెలకొన్నాయి.
నేతన్నకు చంద్రబాబు సర్కారు శఠగోపం
అధికారం చేపట్టి 17 నెలలవుతున్నా పట్టించుకోని వైనం
కొత్త పింఛన్లు లేనే లేవు
గత ప్రభుత్వంలో రూ.105.52 కోట్ల సాయంతో ఆదుకున్న వైఎస్ జగన్
తమ కష్టానికి ‘గిట్టుబాటు ధర’ లభించడం లేదు. కుటుంబ పోషణ


