వైద్య విద్యపై చంద్రబాబు వ్యాపారం
గార్లదిన్నె: రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యం, వైద్య విద్యపై వ్యాపారం చేయొద్దని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దుర్మార్గమైన ఆలోచనల్ని చంద్రబాబు విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వ యకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజా నాథ్ అన్నారు. ఆదివారం మండలంలోని కల్లూరులో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బస్టాండ్ సర్కిల్‌లోని మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి విగ్రహం, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శైలజానాఽథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయన్నారు. చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేసే దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందన్నారు. నవంబర్ 4న శింగనమల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే భారీ ర్యాలీలో అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. యువ నాయకుడు, శైలజానాథ్ తనయుడు రుత్విక్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీదేవి, శింగనమల నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆంజనేయులు, వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, బీకేఎస్ జెడ్పీటీసీ భాస్కర్, ఆర్టీఐ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నారాయణస్వామి, నాయకులు చీమల శ్రీనివాసులు, చితంబరరెడ్డి, బృందావన్ రామాంజనేయులు, రవి, కిష్టన్న, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు పీరా, క్రిస్టియన్ విభాగం అధ్యక్షుడు లక్ష్మన్న, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎంవి దుర్మార్గపు ఆలోచనలు
మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం
వైద్య విద్యపై చంద్రబాబు వ్యాపారం


