14 మంది జూదరుల అరెస్ట్
తాడిపత్రి రూరల్: మండలంలోని ఊరుచింతల కొండల్లో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ.1,66,150 నగదు, తొమ్మిది సెల్‌ఫోన్లు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను తాడిపత్రి అప్‌గ్రేడ్ ఎస్‌ఐ ధరణిబాబు వెల్లడించారు. అందిన సమచారం మేరకు ఆదివారం ఊరుచింతల గ్రామ శివారున తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో కొండల్లో పేకాట ఆడుతున్న 14 మంది జూదరులు పట్టుబడ్డారన్నారు. వీరిలో జమ్మలమడుగులోని కన్నేనూరువీధికి చెందిన రామాంజనేయులు, సంజామల మండలం గిద్దలూరుకు చెందిన రామకృష్ణ, అవుకు మండలం సింగనపల్లికి చెందిన కంబయ్య, కడపలోని సాయి స్ట్రీట్‌కు చెందిన నాగరాజు, వేంపల్లి మండలం వెలమవారిపల్లికి చెందిన కరుణాకర్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం బోలుగుట్లపల్లికి చెందిన కొండారెడ్డి, పులివెందులలోని రాజారెడ్డి కాలనీకి చెందిన షేక్ మాబూషరీఫ్, ముద్దనూరు మండలం కోసినేపల్లి గ్రామానికి చెందిన అన్నయ్య, తాడిపత్రికి అమీర్ బాషా, పోరాటకాలనీకి చెందిన సోమశేఖరరెడ్డి, ఇందిరానగర్‌కు చెందిన శివదత్త, శ్రీనివాసపురానికి చెందిన రషీద్, సుంకులమ్మపాలెంకు చెందిన సురేష్, పెద్దపప్పూరు మండలం ఆమళ్లదిన్నెకు చెందిన గుత్తా నరేంద్ర ఉన్నారు. జూదరులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
● శెట్టూరు: మండలంలోని లక్ష్మంపల్లి వద్ద పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం మేరకు ప్రొబేషనరీ ఎస్‌ఐ నరసింహారెడ్డి, సిబ్బంది ఆదివారం లక్ష్మంపల్లికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.9,800 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాంభూపాల్ తెలిపారు.
రూ.1.66 లక్షల నగదు,
నాలుగు కార్లు స్వాధీనం


