అ‘పూర్వ’ కలయిక
యాడికి: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో 1970–75లో 6 నుంచి పదో తరగతి వరకు కలిసి చదువుకున్న వారిలో దాదాపు 80 మంది అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తరగతి గదులను తాకుతూ పరవశించిపోయారు. నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. ప్రస్తుత హెచ్‌ఎం రామాంజనేయులుతో పాటు నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు భాస్కరరెడ్డి, సుబ్బారెడ్డి, శేషారెడ్డిని ఘనంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు వెంకటకృష్ణారెడ్డి, మహబూబ్ బాషా, సత్యనారాయణ, లింగం చంద్రశేఖర్, చింతా వెంకటయ్య, దాసరి కృష్ణ, సంటప్ప, చింతా వెంకటయ్య, నల్లప్ప, మంజుల, ఉమామహేశ్వరి, టెంకాయల హరిస్వామి, తదితరులు నేతృత్వం వహించారు.
● శింగనమల: స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో 1987–88 బ్యాచ్ విద్యార్థులు 38 సంవత్సరాల తర్వాత అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. నాటి గురువులు మనోహరిదేవి, నామ్‌దేవ్, పెద్దయ్య, బాలకృష్ణ, సుబ్బారెడ్డి, పాఠశాల స్థలదాత ఉస్థిపల్లి నాగరాజును ఘనంగా సన్మానించారు. నాటి అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు.
అ‘పూర్వ’ కలయిక


