అంబరం.. దీపావళి సంబరం
ప్రతి లోగిలి దీపకాంతులతో తేజోమయంగా మారింది. పటాసుల మోతతో పల్లె, పట్నం తేడా లేకుండా గర్జించింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా వెలుగు దివ్వెల దీపావళి పండుగ సంబరం అంబరాన్నంటింది. వాడవాడలా కాంతులు వెదజల్లాయి. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ప్రజలు బాణాసంచా పేలుస్తూ ఆనందంలో మునిగితేలారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు ఇళ్లలో లక్ష్మీ పూజ చేసుకున్నారు. సాయంత్రం వేళ ఇంటి ముంగిళ్లను అందంగా అలంకరించి దీపాలు వెలిగించారు. – అనంతపురం కల్చరల్:
అంబరం.. దీపావళి సంబరం


