● కూటమి పాలనంతా దోపిడీ మయం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
● మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌తో కలిసి పామిడిలో ‘కోటి సంతకాల సేకరణ ’
పామిడి: కూటమి ప్రభుత్వ మోసపూరిత, అవినీతి పాలనపై అలుపెరుగని పోరాటాలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ పనిచేస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సోమవారం స్థానిక కోటవీధిలోని తలవాలకట్ట వద్ద గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించి కోటి సంతకాల సేకరణతో పాటు అనుబంధ విభాగాల కమిటీ నియామకాలకు సంబంధించి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ‘అనంత’తో పాటు వైఎస్సార్ సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, పార్లమెంటు పర్యవేక్షకులు నరేష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రూ.8 వేల కోట్లతో 17 మెడికల్ కళాశాల నిర్మాణాలను ప్రారంభించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి కోట్ల రూపాయలను దోచుకోవాలని చూస్తున్నారన్నారు. మెడిసిన్ విద్యను పేద విద్యార్థులకు అందని ద్రాక్ష చేసి పేదల జీవితాలను చీకటిమయం చేస్తున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఉద్యమాలు చేసి కూటమి ప్రభుత్వ మెడలు వచ్చి ఇప్పటికే అన్నదాత సుఖీభవ, ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధించామని గుర్తు చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తాజాగా చేపట్టిన కోటి సంతకాల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే రథ సారథులన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్వయంగా అధినేత వైఎస్ జగన్ తెలిపారని గుర్తు చేశారు. కార్యకర్తలకు ఏ కష్టమెచ్చినా పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. విద్య, వైద్య రంగాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తే.. కూటమి ప్రభుత్వం 16 నెలల పాలనలో వాటిని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. జగన్‌ను మళ్లీ సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. పార్టీ పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియం, మెడికల్ కాలేజ్‌ల పెంపు, ప్రజా సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకున్న ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కలూరు దిలీప్‌రెడ్డి, ఆర్గనైజింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి, పట్టణ, రూరల్ కన్వీనర్లు నాగూరు ఈశ్వర్‌రెడ్డి, రమావత్ రామకృష్ణ నాయక్, ఓసీ మహిళా విభాగం డైరెక్టర్ కుమ్మెత లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు బోయ రామచంద్ర, అనుంపల్లి సూరి, ఆర్‌సీ వెంకట్రామిరెడ్డి, మైనార్టీ నాయకులు బీ. ఆసిఫ్, రజాక్, ఆదామ్, పీ. అనిల్‌కుమార్‌రాజా, బొల్లు వెంకట్రామిరెడ్డి, ఎన్. హరినాథ్‌రెడ్డి, చాకలి సుంకన్న, శివ, రాజు, ఓబులేసు, సర్పంచ్ నారాయణస్వామి, రామకృష్ణారెడ్డి, బయపరెడ్డి, జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం


