జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృ
సత్యసాయి నామం.. దివ్య చరితం
● ఘనంగా సత్యసాయిబాబా
అవతార ప్రకటన దినోత్సవం
ప్రశాంతి నిలయం: భగవాన్ సత్యసాయిబాబా అవతార ప్రకటన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం సత్యసాయి విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు యజుర్ మందిరం నుంచి నాదస్వరంతో వేదమంత్రోచ్ఛారణలతో ర్యాలీగా ప్రశాంతి నిలయం చేరుకున్నారు. సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సంగీత విభావరి నిర్వహించారు. ‘సాక్షాత్ పరబ్రహ్మసాయి’ పేరుతో సత్యసాయి పూర్వ విద్యార్థులు చర్చలు నిర్వహించారు. సత్యసాయి తత్వాన్ని చక్కగా వివరించారు. సాయంత్రం సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ పూర్వ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ‘శతనాద నీరాజనం’ పేరుతో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం నిర్వహించారు. 100 మంది సంగీత విద్వాంసులు, 75 మంది సంగీత వాయిద్యకారులు, 25 మంది సంగీతకారులతో కలసి సంగీత విభావరి సాగింది. భారతీయ, పాశ్చాత్య సంగీత రీతులలో వారు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మైమరపించింది.
సందడిగా దీపావళి వేడుకలు
ప్రశాంతి నిలయంలో దీపావళి పర్వదిన వేడుకలు సండిగా సాగాయి. సోమవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకరరాజు ప్రమిదలు వెలిగించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఆయన మిరుమిట్లు గొలిపే బాణసంచా పేల్చారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు, ట్రస్ట్ ఉద్యోగులు వేడుకల్లో పాల్గొన్నారు.


