
కలంపై జులుమా?
IIలో
ఈశాన్య రుతుపవనాల ప్రవేశం
జిల్లాలోకి ఈశాన్య రుతుపవనాలు గురువారం ప్రవేశించాయి. ఈ రబీలో 1.08 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
అనంతపురం: ప్రజల తరఫున పోరాడుతున్న ‘సాక్షి’ గొంతుక నొక్కడానికి కూటమి ప్రభుత్వం మరో సారి పోలీసులను ప్రయోగించింది. ప్రధాన సంచికలో ప్రచురితమైన వార్తకు సంబంధించి ఇప్పటికే దాఖలు చేసిన రెండు అక్రమ కేసుల్లో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డికి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పోలీసులతో నోటీసులు జారీ చేయిం చింది. ఏకంగా రాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయానికి వెళ్లడాన్ని పరిశీలిస్తే, వారిపై అధికార పెద్దల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రజల పక్షాన నిలుస్తున్న జర్నలిస్టుల గొంతు నొక్కేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని జర్నలిస్టులు, మేథావులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
పత్రికా స్వేచ్ఛను హరించడమే
‘సాక్షి’ పత్రిక ఎడిటర్‌పై కక్ష గట్టి పోలీసుల సాయంతో వరుసగా కేసులు నమోదు చేయడం ఆక్షేపణీయం. పత్రికల్లో వార్త ప్రచురిస్తే.. ఆ వార్తకు సంబంధించి ‘న్యూస్ సోర్స్’ను వెల్లడించాలని పోలీసులు బలవంతం చేయలేరు. వరుసగా కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది.
– డాక్టర్ శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ ఇంటలెక్చువల్ ఫోరం
మూల్యం చెల్లించుకుంటారు
పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి కార్యాలయాలపై దాడులు, ఎడిటర్‌పై కేసులు అప్రజాస్వామికం. వీటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి దాడులను అన్ని ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
– సాకే హరి, ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
దుర్మార్గమైన చర్య
కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం పత్రికలకు గాని, ప్రజలకు గాని అన్యాయాలపై మాట్లాడే అవకాశం ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో ప్రజల సొమ్ము దోచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించే పత్రికలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య.
– తలారి రామాంజనేయులు, సీనియర్ జర్నలిస్ట్

కలంపై జులుమా?

కలంపై జులుమా?

కలంపై జులుమా?

కలంపై జులుమా?

కలంపై జులుమా?