
అసమర్థ ప్రభుత్వాన్ని నిలదీద్దాం
● మాజీ మంత్రి, సాకే శైలజనాథ్
పుట్లూరు: పాలన చేతకాక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న అసమర్థ కూటమి ప్రభుత్వాన్ని కోటి సంతకాల కార్యక్రమం ద్వారా నిలదీద్దామంటూ ప్రజలకు మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ పిలుపునిచ్చారు. గురువారం పుట్లూరు మండలం కడవకల్లు, సూరేపల్లి, అరకటివేముల, ఎ.కొండాపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.కడవకల్లులో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం స్థానిక వైఎస్సార్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలకు అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా వైద్య కళాశాల నిర్మాణాలు చేపడితే.. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడడం సిగ్గుచేటన్నారు. వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పొన్నపాటి మహేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శులు విష్ణునారాయణ, రమణాయాదవ్, నాయకులు పద్మావతమ్మ, సర్పంచ్ రామాంజనేయులు, నియోజకవర్గ యవజన విభాగం అధ్యక్షుడు భానుకిరణ్‌రెడ్డి, బీసీ సెల్ నాయకుడు నారాయణస్వామి, నాయకులు నాగేశ్వరరెడ్డి, నీలం భాస్కర్, నరసింహారెడ్డి, విశ్వనాథరెడ్డి, నాగేశ్వరరెడ్డి, ఈశ్వరరెడ్డి, నాగముని, రామకేశవ, కుళ్లాయిరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, నాగభూషణం, రసూల్, కేశవనాయుడు, కంచెం శ్రీనివాసులరెడ్డి, రామమోహన్, సూరి, పెద్దిరాజు(పెద్దోడు), తదితరులు పాల్గొన్నారు.