
నో‘ట మాట’ లేక
టమాట ధరలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక్కోసారి ధరలు ఆకాశాన్నంటి రైతులకు లాభాలు తెచ్చి పెట్టే ఈ పంట.. మరో సారి అథఃపాతాళానికి పడిపోయి కన్నీరు పెట్టి స్తోంది. ఎక్కడ పడితే అక్కడ పారబోసేలా చేస్తోంది. కొన్ని రోజులుగా మార్కెట్లో టమాట ధరలు పూర్తిగా పడి పోయాయి. ఒక్కో బాక్సు రూ.70 నుంచి రూ. 100 లోపే పలుకుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటలను మార్కెట్‌కు తీసుకువెళ్లే వాహనం ఖర్చులు కూడా మిగలకపోవడంతో దిక్కుతోచక రోడ్ల పక్కన పారబోస్తున్నారు. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని పిల్లలపల్లి వద్ద ప్రధాన రహదారిపై కుప్పలు కుప్పలుగా టమాటలను పారబోసిన దృశ్యమిది. – బ్రహ్మసముద్రం: