నేడు పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు పరిష్కార వేదిక

Oct 13 2025 7:24 AM | Updated on Oct 13 2025 7:48 AM

అనంతపురం అర్బన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. ఫోన్‌, ఆధార్‌ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.

ప్రజాస్వామ్యాన్ని

కాపాడండి సార్‌!

అనంతపురం సెంట్రల్‌: ‘న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే వారి ఎదుటే నాపై దాడి చేశారు. అయినా దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు’ అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరుల దాడిలో గాయపడిన మరో బాధితుడు ప్రభాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్‌ అంటూ వేడుకున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము శ్రీనగర్‌కాలనీ సమీపంలోని ఎలైట్‌హోమ్‌లో నివసిస్తున్నామన్నారు. ఈనెల 10న అక్కడ ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్లామన్నారు. పక్కింట్లో నివాసముంటున్న ఓ బాలుడు క్రికెట్‌ బాల్‌ వేయమని కోరగా వేశానని, ఆ బంతి భువన చక్రవర్తి కారుకు తగలిందని చెబుతూ కొంతమంది తనపై చెప్పుతో దాడి చేశారన్నారు. న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు వెళ్తే మళ్లీ పోలీసుల సమక్షంలోనే తనపై చేయి చేసుకున్నారని వాపోయారు. ఏఆర్‌ కానిస్టేబుల్‌ హరికుమార్‌ను కూడా కొట్టే ప్రయత్నం చేశారన్నారు. అన్నీ తెలిసిన మాలాంటి వారికే ప్రజాస్వామ్యంలో రక్షణ లేదంటే, ఇక సామాన్యులు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు. తాము తప్పు చేసి ఉంటే ఎలాంటి శిక్షకై నా సిద్ధమన్నారు. ఇప్పటికీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అల్లుడు తేజ అనుచరులమని చెప్పుకుంటూ కొందరు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

రాష్ట్ర స్థాయి గోల్‌ షూట్‌ విజేత ‘అనంత’

కదిరి అర్బన్‌: చిత్తూరు జిల్లా నేరేబైలు గ్రామంలో ఈ నెల 11, 12వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి గోల్‌ షూట్‌ పోటీల బాలికల విభాగంలో ఉమ్మడి అనంతపురం జట్టు విజయం సాధించింది. అబ్బాయిల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా గోల్‌షూట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ప్రసన్నకుమార్‌ ఆదివారం వెల్లడించారు.

గుత్తిలో టీడీపీ కార్యకర్తల గూండాగిరి

గుత్తి: పట్టణంలో టీడీపీ కార్యకర్తలు గూండాగిరి ప్రదర్శించారు. దస్తగిరి, కుష్బూ అనే దంపతులపై అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశారు. వివరాలు.. రెండు మాసాల క్రితం దస్తగిరి ఇంటిని టీడీపీ కార్యకర్తలు బలవంతంగా ఖాళీ చేయించారు. అంతే కాకుండా భార్యాభర్తపై దాడి చేశారు. ఈ ఘటనపై దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 21 మందిపై కేసు నమోదు చేశారు. తమపైనే కేసు పెడతారా అంటూ ఆదివారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న దస్తగిరి, కుష్బూ దంపతులపై షణ్ముఖ, శివ, పుల్లయ్యతో పాటు మరో ముగ్గురు దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ సురేష్‌ సిబ్బందితో కలిసి బస్టాండ్‌కు చేరుకోగా.. అప్పటికే టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి ఉడాయించారు. గాయపడిన దంపతులను పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపారు. అనంతరం వారు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా.. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. పైగా వారినే గద్దించి స్టేషన్‌ నుంచి బయటకు పంపారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని బాధితుడు దస్తగిరి చెప్పాడు.

నేడు పరిష్కార వేదిక 1
1/3

నేడు పరిష్కార వేదిక

నేడు పరిష్కార వేదిక 2
2/3

నేడు పరిష్కార వేదిక

నేడు పరిష్కార వేదిక 3
3/3

నేడు పరిష్కార వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement