
మహిళా చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలం
● ఐద్వా అఖిల భారత కోశాధికారి
పుణ్యవతి
అనంతపురం అర్బన్: మహిళా రక్షణ చట్టాల అమలులో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఐద్వా అఖిల భారత కోశాధికారి పుణ్యవతి మండిపడ్డారు. ఫలితంగా దేశంలోను, రాష్ట్రంలోను మహిళలకు రక్షణ కరువైందన్నారు. బేటీ బచావో... బేటీ పడావో అని మాటల్లో చెబుతున్నా.. ఆచరణలో చూపించడం లేదని ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి, కోశాఽధికారి సావిత్రి, జిల్లా కార్యదర్శి చంద్రిక, నాయకురాలు నాగమణితో కలిసి విలేకరులతో పుణ్యవతి మాట్లాడారు. మహిళల సమస్యలపై సోమవారం నుంచి మూడు రోజుల పాటు అనంతపురం నగరంలో జరగనున్న ఐద్వా రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి మహిళకు ఆడబిడ్డనిధి కింద ప్రతి నెల రూ.1,500, వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలు వరకు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హమీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాట వాటిని అమలు చేయలేదన్నారు. వీటిపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. మహాసభల్లో భాగంగా సోమవారం నగరంలో ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
యల్లనూరు: మండలంలోని మల్లాగుండ్ల సమీపంలో చిత్రావతి నది ఒడ్డున పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్న నాగశేఖర్, సీతారామిరెడ్డి, శీనుతో పాటు 12 మందిని అరెస్ట్ చేసి, 11 ద్విచక్ర వాహనాలు, రూ.82,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు.
కర్ణాటక మద్యం పట్టివేత
అనంతపురం సెంట్రల్: కర్ణాటక మద్యం తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. వివరాలను అనంతపురం ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్సు సీఐ జయనాథ్‌రెడ్డి, ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ ఆదివారం వెల్లడించారు. టాటా జెస్ట్ వాహనం నుంచి తెల్లటి సంచులను దింపుతుండగా అనుమానం వచ్చిన ఎకై ్సజ్ పోలీసులు గమనించి, తనిఖీ చేశారు. అందులో 90 ఎంఎల్ సామర్థ్యం ఉన్న కర్ణాటక టెట్రా ప్యాకెట్ల మద్యం ఉన్నట్లుగా గుర్తించి వాహనంతో సహా స్వాధీనం చేసుకున్నారు. మద్యం దింపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో తన పేరు వెంకటపతి అని, లెనిన్‌నగర్‌లో నివాసముంటున్నట్లుగా వెల్లడించాడు. కర్ణాటకలోని బాగేపల్లి నివాసి కిషోర్ నుంచి తక్కువ ధరకే మద్యం కొనుగోలు చేసి అనంతపురంలో తన స్నేహితుడు నాగేంద్ర ద్వారా అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు.