
ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీగా అరుణకుమారి
అనంతపురం సెంట్రల్: మహిళా,శిశు సంక్షేమశాఖ ఇన్‌చార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా అరుణకుమారిని నియమిస్తూ కలెక్టర్ ఓ.ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈమె జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల శిశుగృహలో నవజాత శిశువు ఆకలి చావుకు గురి కావడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పర్యవేక్షణ లోపమున్నట్లు తేలడంతో పీడీ నాగమణిని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో రెగ్యులర్ పీడీ నియామకం జరిగే వరకూ ఇన్‌చార్జ్ బాధ్యతలను అరుణకుమారికి అప్పగించారు. శుక్రవారం ఈమె బాధ్యతలు తీసుకోనున్నట్లు ఐసీడీఎస్ అధికారవర్గాలు వెల్లడించాయి.