
అనంతలో మహాత్ముని అడుగుజాడలు
● అక్షరబద్ధం చేసిన డాక్టర్ రమేష్ నారాయణ
● నేడు ఉచితంగా పంపిణీ
అనంతపురం కల్చరల్: దేశ స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపిన మహాత్ముని అడుగుజాడలు జిల్లా అంతటా మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. నాటి దేశకాల పరిస్థితులను, మొక్కవోని దేశభక్తిని ఘనంగా చాటే స్మృతులు తరాలు సాగిపోతున్నా సజీవ రూపాలుగా దర్శనమిస్తూనే ఉన్నాయి. మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్న అనంత వాసులు ఎందరో తాము సైతం అంటూ స్వాతంత్య్రోద్యమంలో పాలు పంచుకున్నారు. ఈ విశేషాలన్నింటినీ ఎంతో హృద్యంగా చాటి చెప్పేలా ‘అనంత’ జిల్లాలో గాంధీజీ’ పేరుతో అక్షర బద్ధం చేశారు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ పతికి రమేష్‌నారాయణ. గురువారం జరుగనున్న గాంధీజీ జయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

అనంతలో మహాత్ముని అడుగుజాడలు