
ఆర్మీ మద్యాన్ని తరలిస్తూ పట్టుబడిన ఆర్టీసీ డ్రైవర్
అనంతపురం: కర్ణాటక నుంచి ఆర్మీ మద్యాన్ని తరలిస్తూ ఎకై ్సజ్ అధికారులకు ఓ ఆర్టీసీ డ్రైవర్ పట్టుబడ్డాడు. వివరాలను అనంతపురం ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం బెంగళూరు నుంచి వస్తున్న ఆర్టీసీ అనంతపురంలోని ధర్మవరం రోడ్డులో ఉన్న శివకోటి ఆలయం వద్ద ఆపి తనిఖీ చేశారు. సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణిస్తున్న శివకోటి ఆలయం వద్ద నివాసముంటున్న ఆర్టీసీ డ్రైవర్ పి.ఓబులనారాయణరెడ్డి వద్ద నుంచి 60 ఆర్మీ ఫుల్ బాటిళ్ల మద్యం పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అదే బస్సులో ముందు వైపు కూర్చొన్న పాత నిందితులు సాకే పవన్‌కుమార్, వడే శ్రీనివాసులు వెంటనే బస్సు దిగి పారిపోయారు. బెంగళూరులోని ఆర్టీ క్యాంటీన్ నుంచి మద్యం కొనుగోలు చేసి జిల్లాకు అక్రమంగా చేరవేస్తున్నట్లుగా విచారణలో వెలుగు చూసింది.