
తండ్రి స్ఫూర్తితో...
తాడిపత్రిలోని రెడ్డివారిపాలెంలో నివాసముంటున్న మనోహర్‌రెడ్డి భారత సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్ఫూర్తితో భారత సైన్యంలో చేరాలని కుమార్తె సాయిహరితరెడ్డి పరితపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. అయినా రాజీ పడకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ తొలిసారిగా అమ్మాయిలకు పైలెట్ శిక్షణ కోసం చేపట్టిన ఇంటర్వ్యూలకు హాజరైంది. ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి పైలెట్ శిక్షణకు అర్హత సాధించిన సాయిహరిత రెడ్డిని అభినందిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని వ్యోమగామి కల్పనాచావ్లా తల్లి అందజేశారు. ప్రస్తుతం సాయి హరితారెడ్డి దక్షిణాఫ్రికాలో పైలెట్ శిక్షణ తీసుకుంటోంది. తన తండ్రిలా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనేదే లక్ష్యమని ఆమె చెబుతోంది.