
ప్రతి రోగికి మెరుగైన సేవలందించాలి
● మంత్రి సత్యకుమార్
అనంతపురం మెడికల్: చికిత్స కోసం వచ్చే ప్రతి రోగికీ మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. సోమవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ప్రసంగించారు. గుండె జబ్బుల నివారణపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఎయిమ్స్‌లో కూడా లేని అత్యాధునిక పరికరాలు సూపర్ స్పెషాలిటీలో ఉన్నాయన్నారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ చంద్రబోస్.. గుండె శస్త్రచికిత్సల్లో అందించిన సేవలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ద్వారా వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జీజీహెచ్ సూపరిండెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పాల్గొన్నారు.