
ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోం
అనంతపురం కార్పొరేషన్/అనంతపురం సిటీ: తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. అధికారుల గ్రూపు నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, 9 నెలల అరియర్స్ అందించాలన్నారు. వచ్చే నెల 1న యథావిధిగా సచివాలయాల్లోనే పింఛన్ పంపిణీ చేస్తామని, ఆ తర్వాత నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకలు సుధాకర్, లక్ష్మినారాయణ, వరప్రసాద్, విమల పాల్గొన్నారు.