
వైద్య పరీక్షలు చేయించుకోవాలి
జంక్ ఫుడ్, పొగ తాగడం, వ్యాయామం లేకపోవడంతో యువత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వారంలో కనీసం ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలి. వంశపారంపర్యంగా కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత రోజుల్లో 12 మందిని పరీక్షిస్తే అందులో ముగ్గురికి కచ్చితంగా బీపీ సమస్య కన్పిస్తోంది.ఈ పరిస్థితుల్లో 40 ఏళ్లు దాటిన వారందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
– సుభాష్ చంద్రబోస్, అసోసియేట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి