
డిజిటల్ బుక్
కార్యకర్తలకు అండగా ఉండేందుకే
డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు అనంత, పార్టీ నాయకులు
అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు పరాకాష్టకు చేరాయి. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కక్ష సాధింపు చర్యలు ఊపందుకున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా ఉంటానని, అన్యాయం చేసిన ఎవరినీ వదలబోనని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ బుక్ ప్రవేశపెట్టారని’ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ ఆవరణలో డిజిటల్ బుక్కును ఆయన ఆవిష్కరించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులపై హైకోర్టు మండిపడడమే కాకుండా కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చిందని, ఇంత వరకు దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితిని చూడలేదని అనంత అన్నారు.
వెబ్‌సైట్‌లో నమోదు చేస్తాం
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని అనంత హెచ్చరించారు. పాలకుల ఆదేశాలతో వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టేలా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎక్కడున్నా వదిలిపెట్టబోమన్నారు. బాధితులు ఎవరైనా తమ ఇబ్బందులను డీబీ.డబ్ల్యూఈవైఎస్‌ఆర్‌సీపీ.కామ్ అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చన్నారు. 040–49171718 నంబర్‌కు కాల్ చేసి కూడా తెలపవచ్చునన్నారు. ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో, 29న మండల స్థాయిలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఉన్మాది అని, అతనికి మతిస్థిమితం లేదని, వైఎస్ జగన్, చిరంజీవిలపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు. అతని పేరు ఇప్పటికే డిజిటల్ బుక్‌లో నమోదైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, పార్టీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్, హిందూపురం పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు అశ్వత్థ నాయక్, రాష్ట్ర నాయకులు పెన్నోబులేసు, వెన్నం శివరామిరెడ్డి, కృష్ణవేణి, బాబా సలాం, జానీ, ఎగ్గుల శ్రీనివాసులు, రంగంపేట గోపాల్‌రెడ్డి, మీసాల రంగన్న, అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, శ్రీనివాసులు నాయక్, మల్లెమీద నరసింహులు, వైపీ బాబు, చంద్రశేఖర్ యాదవ్, అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, నాయకులు దాదు, నాగార్జున్ రెడ్డి, చింతకుంట మధు, కేశవరెడ్డి, అనిల్‌కుమార్ గౌడ్, సాకే కుళ్లాయస్వామి, సాకే చంద్రలేఖ, ఉష, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బంది పెట్టే వారి వివరాలను అందులో నమోదు చేస్తాం
డిజిటల్ బుక్ ఆవిష్కరణలో అనంత
బాలకృష్ణ ఓ ఉన్మాదని మండిపాటు

డిజిటల్ బుక్