
ఆర్టీసీ ఎండీకి నిరసన సెగ
తాడిపత్రిటౌన్: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ద్వారాకా తిరుమలరావుకు పారిశుధ్య కార్మికుల నుంచి నిరసన సెగ తాకింది. సీ్త్రశక్తి పథకం అమలు తీరును పరిశీలించేందుకు తాడిపత్రిలో శుక్రవారం పర్యటించిన ఆయన్ను పారిశుధ్య కార్మికులు చుట్టుముట్టారు. వేతనాలు పెంచి తమ కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు కోరారు. త్వరలోనే కమిటీ ఏర్పాటు చేసి తీపి కబురు చెబుతామని ఎండీ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించి సీ్త్రశక్తి అమలు తీరుపై ప్రయాణికులను ఆరా తీశారు.
త్వరలో ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
సీ్త్రశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారాకా తిరుమలరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. ఇందులో తిరుపతికి 300, విశాఖకు 100, మరో 12 డిపోలకు 50 బస్సుల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ జగదీష్, ఏఎస్పీ రోహిత్‌కుమార్‌చౌదరి, ఆర్టీసీ డీఎం మురళీధర్ పాల్గొన్నారు.