
జీఎస్టీపై అవగాహన చర్యలు
● సీఎస్‌కు తెలిపిన కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: జీఎస్టీ తగ్గింపుపై జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, పీఎం కుసుమ్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, తదితర అంశాలపై సీఎస్ శుక్రవారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ భాస్కర్‌వల్లి, ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్, నెడ్‌క్యాప్ అధికారి అశోక్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషర్ సరేంద్రరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన చర్యలను సీఎస్‌కు కలెక్టర్ వివరించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టేటా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.