
అనంతపురం సిటీ: జెడ్పీ చైర్మన్‌గా బోయ గిరిజమ్మ నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. డిప్యూటీ సీఈఓ జీవీ సుబ్బయ్య, ఉద్యోగులతో కలసి ముందుగా తన చాంబర్‌లో గిరిజమ్మ కేక్ కట్ చేసి, పంచారు. ఈ సందర్భంగా గిరిజమ్మకు ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువ కప్పి సత్కరించారు. నాలుగేళ్ల తన పదవీ కాలంలో తనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సహకరించిన ఉద్యోగులకు గిరిజమ్మ కృతజ్ఞతలు తెలిపారు.